May 12
విశ్వంలోని రహస్యాలను అందరికీ తెలియజెప్పిన హబుల్ టెలిస్కోప్ రిపేరుకొచ్చింది. నాసా పరిశోధనల్లో హబుల్ టెలిస్కోప్ అందించిన సహకారం ఎంతో ఉంది. ఇటీవలి కాలంలోనూ నింగిలోని నిగూఢరహస్యాలను బంధించింది. నక్షత్రం ఏర్పడడం.. ఒకేచోట కొన్ని వందల నక్షత్రాలు చేరడం.. ఇలా ఎన్నో విశ్వవింతలను ఫోటోలుగా తీసి భూమికి పంపించింది. దీని సర్వీస్ కాలం ముగుస్తుండడంతో.. 2011 నాటికి మరో టెలిస్కోప్‌ను పంపించాలని నాసా భావిస్తోంది. ఈలోగా హబుల్ టెలిస్కోప్‌కు కొన్ని సమస్యలు రావడంతో.. వీటిని సరిదిద్దడానికి ప్రత్యేక బృందాన్ని నాసా అట్లాంటిస్ నౌకలో పంపిస్తోంది. ఇప్పటివరకూ హబుల్ తీసిన చిత్రాల్లో కొన్ని అద్భుతమైనవి ఈ టపాతో జతపరుస్తున్నాము. ఒక్కసారి చూడండి. కింది ఫోటోను క్లిక్ చేస్తే.. హబుల్ విశ్వ ప్రపంచంలోకి మీరు అడుగుపెడతారు
![]() |
| hubble |
|
|
|

